Uttar Pradesh: 60 ఏళ్లుగా ఇసుకే ఆమె ఆహారం..!

ఆహారం తీసుకుంటున్నప్పుడు.. పంటిలో చిన్న రాయి పడితేనే విలవిల్లాడిపోతాం. కానీ ఆ వృద్ధురాలు మాత్రం ఇసుకను కరకరా నమిలి తినేస్తోంది.

Published : 26 Nov 2021 12:39 IST

వారణాసి: ఆహారం తీసుకుంటున్నప్పుడు.. పంటిలో చిన్న రాయి వస్తేనే విలవిల్లాడిపోతాం. కానీ ఆ వృద్ధురాలు మాత్రం ఇసుకను కరకరా నమిలి తినేస్తోంది. వాస్తవానికి 60ఏళ్ల నుంచి అదే ఆమె ఆహారం. అయినా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. 75 ఏళ్లు దాటినా ఎంతో చురుగ్గా పొలం పనులు చక్కబెట్టేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ బామ్మ. 

వారణాసి జిల్లాకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కుష్మావతిదేవికి ఇసుకే ఆహారం. షోలాపుర్‌ ప్రాంతంలోని కఠారి గ్రామంలో కుటుంబంతో కలిసి ఆమె నివసిస్తోంది. 15 ఏళ్ల వయసులో కడుపులో ఇబ్బందిగా అనిపించడంతో ఆమె తొలిసారి ఇసుక తినేసింది. అదే ఆమెకు చాలా సౌకర్యంగా అనిపించడంతో.. అప్పటినుంచి ఇసుకను ఆహారంగా తీసుకుంటోంది. 75 ఏళ్లు దాటినా కుష్మావతి దేవి ఇంటి పనులు, పొలం పనులను చకచకా చేసుకుంటోంది. ఎంతో చురుగ్గా ఉంటోంది. ఇసుక మాత్రమే తింటున్న తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని ఆమె తెలిపింది. తన ఆరోగ్య రహస్యం ఇసుక తినడమేనని ఆమె చెబుతోంది. 

ఇసుక తినొద్దని కుష్మావతిదేవికి కుమారుడు, మనవలు, బంధువులు ఎంత చెప్పినా ఆమె వినడంలేదు. ఆమెతో ఈ అలవాటును మాన్పించేందుకు వైద్యులను సంప్రదించాలని కుటుంబసభ్యులు భావించినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. పాలతో కలిపి ఇసుకను తీసుకోవాలని స్థానిక వైద్యుడు ఒకరు ఆమెకు సూచించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆమె ఇసుకను ఆహారంగా తీసుకోవడానికి మానసిక సమస్య కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. శరీరంలో జింక్‌, ఐరన్‌ లోపం ఉన్నవారు.. ఇలా ఇసుకను ఆహారంగా తీసుకుంటారని చెబుతున్నారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని