SCR: 24 ప్రత్యేక రైలు సర్వీసుల పొడిగింపు

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పలు రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య.....

Updated : 23 Jun 2021 20:51 IST

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పలు రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 24 ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వీసులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని పేర్కొంది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని ప్రజా సంబంధాల ముఖ్య అధికారి సీహెచ్‌ రాకేశ్‌ స్పష్టంచేశారు. వీటిలో 6 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనుండగా.. 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు రైళ్లు వారంలో రెండు సార్లు తిరగనున్నాయి. ఆయా ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని