Gujarat: 15 మత్స్యకారుల పడవలు గల్లంతు.. రంగంలోకి నావికాదళం!

గుజరాత్‌ గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ఉనా హార్బర్‌ సమీపంలో గురువారం సుమారు 15 చేపలవేట పడవలు గల్లంతయ్యాయి.

Updated : 02 Dec 2021 13:20 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ఉనా హార్బర్‌ సమీపంలో గురువారం సుమారు 15 చేపలవేట పడవలు గల్లంతయ్యాయి. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 10 నుంచి 15 మంది మత్స్యకారులు గల్లంతై ఉండొచ్చని స్థానికులు తెలిపారు. వారి సమాచారంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు.

హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు..

భారత నావికాదళం హెలికాప్టర్‌ సాయంతో గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, కనిపించకుండా పోయిన మత్స్యకారుల్లో నలుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని