logo

భోగి కాంతి సంబర సంక్రాంతి

నగరమంతటా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. తెలుగు వారి పెద్ద పండుగ ఏడాదంతా గుర్తుండిపోయేలా నిర్వహించుకునేందుకు పోటీపడుతున్నారు. మై మరపించే రంగురంగుల ముగ్గులతో వీధులు కళకళలాడుతున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Published : 15 Jan 2022 05:03 IST

నగరమంతటా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. తెలుగు వారి పెద్ద పండుగ ఏడాదంతా గుర్తుండిపోయేలా నిర్వహించుకునేందుకు పోటీపడుతున్నారు. మై మరపించే రంగురంగుల ముగ్గులతో వీధులు కళకళలాడుతున్నాయి. స్థానికంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారితో... ఎక్కడెక్కడో ఉంటున్న నగర వాసుల రాకతో ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. శుక్రవారం వేకువజామున పలు చోట్ల భారీగా ఏర్పాటు చేసిన భోగిమంటల వద్ద పిల్లలు, పెద్దలు సందడి చేశారు. సింహగిరిపై వేణుగోపాలుడి అలంకరణలో తిరువీధులలో ఊరేగుతున్న అప్పన్నను పై చిత్రంలో చూడొచ్ఛు.

-న్యూస్‌టుడే, సింహాచలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని