logo

చుక్కాపూర్‌ అడవుల్లో జోరుగా కోడి పందేలు

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అడవుల్లో సంక్రాంతి సందర్భంగా వందలాది మంది గుమిగూడి జోరుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా సాగుతున్న ఈ తంతుకు పోలీసులు శుక్రవారం

Published : 15 Jan 2022 03:16 IST

54 ద్విచక్రవాహనాలు, కారు స్వాధీనం

పోలీసుల అదుపులో నిర్వాహకులు, కోళ్లు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అడవుల్లో సంక్రాంతి సందర్భంగా వందలాది మంది గుమిగూడి జోరుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా సాగుతున్న ఈ తంతుకు పోలీసులు శుక్రవారం అడ్డుకట్ట వేశారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ జాన్‌రెడ్డి, మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు మూకుమ్మడి దాడులు చేశారు. గమనించిన జూదరులు పరుగులు తీయగా 24 మందిని పట్టుకున్నారు. 54 ద్విచక్రవాహనాలు, ఒక కారు, రూ.20,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. 30 కోళ్లను కూడా పట్టుకున్నారు. నిందితులను ఠాణాకు తరలించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని