logo

అద్భుత ఘట్టం.. మకర జ్యోతి దర్శనం

ఖమ్మం శ్రీనివాస్‌ నగర్‌ శ్రీశాస్తా దేవస్థానంలో మకర జ్యోతి దర్శనం అద్భుతంగా సాగింది. శుక్రవారం ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం

Updated : 15 Jan 2022 02:30 IST

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే

ఖమ్మం శ్రీనివాస్‌ నగర్‌ శ్రీశాస్తా దేవస్థానంలో మకర జ్యోతి దర్శనం అద్భుతంగా సాగింది. శుక్రవారం ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శబరిమల దేవస్థానంలో మాదిరిగా మకర జ్యోతి దర్శనం నిర్వహించారు. మేల్‌శాంతి నారాయణ్‌ నంబూద్రి జ్యోతిని వెలిగించారు. మండల పూజ అనంతరం సంక్రాంతి సందర్భంగా ఏటా మకర జ్యోతి దర్శనం ఉంటుందని, 36 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని నంబూద్రి తెలిపారు. జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని