logo

ఓయూ @ వైఫై

ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి వైఫై క్యాంపస్‌గా మారబోతోంది. ఇప్పటికే సేవలు అందుతున్నప్పటికీ.. నిర్వహణ సరిగా లేక తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో విద్యార్థులు సొంత

Published : 15 Jan 2022 01:43 IST

వార్షిక నిర్వహణకు టెండర్లు పిలవాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి వైఫై క్యాంపస్‌గా మారబోతోంది. ఇప్పటికే సేవలు అందుతున్నప్పటికీ.. నిర్వహణ సరిగా లేక తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో విద్యార్థులు సొంత మొబైల్‌ డాటాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రాంగణాన్ని పూర్తిస్థాయి వైఫై కేంద్రంగా తీర్చిదిద్ది ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారు.

22న సమావేశం
దీంతో వర్సిటీ కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ నేతృత్వంలో యూనివర్సిటీలో వైఫై సేవలు సమర్థంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. వార్షిక నిర్వహణకు వీలుగా తొలుత నెట్‌వర్కింగ్‌ కంపెనీలతో ఈ నెల 22న ఓయూలో సమావేశం నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ప్రాంగణం మొత్తం నెట్‌వర్క్‌ లోపాలు సవరించి పూర్తిస్థాయిలో వైఫై సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ మౌలిక సదుపాయాల కల్పన విభాగం సంచాలకుడు ప్రొ.నవీన్‌కుమార్‌ తెలిపారు. దీనివల్ల ఆచార్యులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎలాంటి ఆటంకం లేకుండా అంతర్జాలం సేవలు వినియోగించేందుకు వీలు కలుగుతుందన్నారు.

ప్రత్యేకంగా వైర్‌లెస్‌ ఫోన్లు
క్యాంపస్‌లోని విభాగాలు, కళాశాలలకు ప్రస్తుతం ఉన్న ల్యాండ్‌ ఫోన్ల స్థానంలో ప్రత్యేకంగా వైర్‌లెస్‌ ఫోన్లు అందిస్తున్నారు. వాకీటాకీ తరహాలో వినియోగించే వీలుంటుంది. 300 ఫోన్లను విభాగాలకు అందించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఫోన్‌ బిల్లులు తగ్గి విశ్వవిద్యాలయానికి పెద్దఎత్తున నిధులు ఆదా కానున్నాయని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని