logo

బెదిరిస్తున్నాడని స్నేహితులే చంపేశారు!

స్నేహితుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యకు కారణమని స్థానికులతో కలిసి మజ్లిస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మాసాబ్‌ట్యాంక్‌లోని

Updated : 15 Jan 2022 06:44 IST

సోహెల్‌ ఖాద్రీ

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: స్నేహితుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ హత్యకు కారణమని స్థానికులతో కలిసి మజ్లిస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మాసాబ్‌ట్యాంక్‌లోని అహ్మద్‌నగర్‌ ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సోహెల్‌ ఖాద్రీ(33) వీడియోగ్రాఫర్‌. గోల్కొండలోని షాజహాన్‌నగర్‌కు చెందిన అహ్మద్‌ఖాన్‌ అలియాస్‌ అప్పూ(24), మాసాబ్‌ట్యాంక్‌లోని సయ్యద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అఫ్జల్‌ అలియాస్‌ నజీర్‌(24), నషేమన్‌ హోటల్‌ ప్రాంత నివాసి మహ్మద్‌ సలీం అలియాస్‌ సలీం(28), బంజారాహిల్స్‌ ఖాజానగర్‌కు చెందిన మహ్మద్‌ అజ్జీ అలియాస్‌ చోటు(26) సోహెల్‌కు స్నేహితులు. పాతకక్షల నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే నేర చరిత్ర ఉన్న సోహెల్‌ ఖాద్రీ.. ఎలాగైనా సోహెల్‌ను అంతం చేయాలని పథకం వేశారు మిగతా నలుగురు. సోహెల్‌ ఖాద్రీని గురువారం రాత్రి ఫస్ట్‌లాన్సర్‌ ప్రాంతానికి పిలిచారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మాసాబ్‌ట్యాంక్‌ బంజారా బ్రిడ్జి సమీపంలో మద్యం తాగారు. పథకం ప్రకారం మిగతా నలుగురు కొబ్బరి బొండాం కొట్టే కత్తితో సోహెల్‌ను గొంతు కోసి చంపారు.

పెట్రోలింగ్‌ చేయడం లేదు..: రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉండే బంజారా బ్రిడ్జి ప్రాంతంలో ఇప్పటివరకు ముగ్గురు హత్యకు గురయ్యారని స్థానికులు తెలిపారు. మజ్లిస్‌ కార్యకర్తలతో కలిసి బంజారా ఫంక్షన్‌హాల్‌ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు.  పశ్చిమ మండలం అదనపు డీసీసీ ఎక్బాల్‌ సిద్ధిఖీ, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి, హుమాయున్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి అక్కడికి చేరకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. కార్పొరేటర్‌ మాజిద్‌ హుస్సేన్‌ వచ్చి పోలీసులతో మాట్లాడారు. పోలీసుల హామీతో ధర్నా విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని