logo
Published : 30/11/2021 04:12 IST

‘కేసీఆర్‌ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది’

యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, తదితరులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ సాధనకు ఆమరణ దీక్షకు దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోరాట పటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోతోందని డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకొని సోమవారం యాదగిరిగుట్టలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. రాష్ట్ర సాధనకు కేసీఆర్‌ తన ప్రాణాలను సైతం అర్పించేందుకు ఆమరణ దీక్ష చేపట్టారని, ఆయన దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పెలిమెల్లి శ్రీధర్‌, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యారుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంకు ఎన్‌డీసీసీబీనే

యాదగిరిగుట్ట పట్టణం: రైతు బిడ్డల ఉన్నత చదువుల కోసం భూమిని మార్టిగేజ్‌ చేసుకొని విద్యారుణాలు అందిస్తున్న ఏకైక బ్యాంకు నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాత్రమేనని డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్టలో ఆ బ్యాంకు యాదగిరిగుట్ట శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు విద్యారుణాలు పొందిన వారికి రుణపత్రాలు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 మందికి విద్యారుణాలు అందించామని పేర్కొన్నారు. 103 ఏళ్ల చరిత్ర కలిగిన ఎన్‌డీసీసీ బ్యాంకు తను బాధ్యతలు చేపట్టే ముందు రూ.1000 కోట్ల టర్నోవర్‌తో నడిచేదని, కేవలం ఏడాదిన్నరలోనే రూ. 650 కోట్లు పెంచగలిగి, ప్రస్తుతం రూ.1650 కోట్ల టర్నోవర్‌తో నడవడం రికార్డు అని తెలిపారు. గతేడాది ఏకంగా రూ.11 కోట్ల ఆదాయం బ్యాంకు అర్జించడం గొప్ప విషయమన్నారు. తాను పదవి ముగిసేలోపు రూ.3 వేల కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు నడపడే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా నల్లగొండ జిల్లా రైతాంగం కోసం బ్యాంకు నుంచి అనేక రకాల సహాయ సహకారం అందజేస్తున్నామని, బ్యాంకుకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్‌ రవీందర్‌ గౌడ్‌, పుర అధ్యక్షురాలు సుధ, పీఏసీఎస్‌ ఛైర్మన్లు రాంచంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, బ్రాంచ్‌ మేనేజర్‌ కావ్య, సహాయ మేనేజర్‌ ప్రతిమ, సూపర్‌వైజర్లు వంశీ, ప్రదీప్‌, సుష్మ పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని