logo
Published : 30/11/2021 04:12 IST

నత్తనడకన కొనుగోళ్లు.. అన్నదాతల అవస్థలు

రామన్నపేటలో మార్కెట్‌ యార్డులో స్థలం లేకపోవటంతో వెంచర్‌లో ధాన్యం నిల్వలు

రామన్నపేట, న్యూస్‌టుడే: ధాన్యం విక్రయంలో అన్నదాతకు అవస్థలు తప్పటం లేదు. కొనుగోళ్లు నత్తనడకన జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం తరలి వస్తుండటంతో నిల్వ చేయడానికి స్థలం కొరత ఏర్పడుతోంది. దీంతో రామన్నపేట తదితర ప్రాంతాల్లో భద్రత లేని వెంచర్‌లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యాన్ని రహదారుల వెంట నిల్వ చేస్తున్నారు. మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీల్లో 8 గ్రామాల్లో ఐకేపీ, 14 గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లో సుమారు 4లక్షలు క్వింటాళ్లకు పైగా ధాన్యం నిల్వ ఉంది. ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు 24వేలు క్వింటాళ్లు, పీఏసీఎస్‌ కేంద్రాల్లో 80వేలు బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారు. లారీల కొరత, మిల్లర్లు పెట్టే ఇబ్బందుల కారణంగా రోజుకు 3వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి.

దుబ్బాకలో రహదారి వెంట మొలకెత్తిన ధాన్యాన్ని ఎత్తుతున్న మహిళలు

దయనీయంగా పరిస్థితి..

ప్రధానంగా రామన్నపేట, దుబ్బాక , సిరిపురం తదితర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. రామన్నపేటలో సుమారు 15వేలు క్వింటాళ్ల వరకు ధాన్యం రాగా స్థలం లేక అనేక మంది రైతులు సమీపంలోని వెంచర్‌లలో నిల్వ చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు కేవలం 2వేలు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మూడు రోజుల క్రితం ఈ వెంచర్‌లో ఓ రైతుకు చెందిన 40బస్తాలకు పైగా ధాన్యం చోరీకి గురవటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దుబ్బాకలో సుమారు 30వేలు క్వింటాళ్లు వరకు ధాన్యం రాగా మైదానం సరిగా లేక రహదారిపై ధాన్యాన్ని నిల్వ చేశారు. ఇటీవల వర్షాలు కురవడంతో నిల్వల కిందకు నీరు పోయి ధాన్యం మొలకెత్తుతోంది. మొలకెత్తిన ధాన్యాన్ని ఎత్తుకుంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ అవస్థలు భరించలేక, ఎప్పుడు కొనుగోలు జరుగుతాయో తెలియక కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ సమస్యపై వెలుగు ఏపీఎం అంజయ్య మాట్లాడుతూ.. లారీల సమస్య కారణంగానే కొనుగోళ్లలో జాప్యం జరిగిందని, ప్రస్తుతం వేగవంతం చేశామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తడిసిన ధాన్యం కొనుగోళ్లు చేపడతామన్నారు.  

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని