logo
Published : 30/11/2021 04:12 IST

ఆంధ్రా ధాన్యం రాకుండా పటిష్ఠ చర్యలు: కలెక్టర్‌

రామాపురం చెక్‌పోస్టును పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, తదితరులు

కోదాడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చెక్‌పోస్టు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు. అనుమతి లేకున్నా ధాన్యం లోడు ట్రాక్టర్లు తెలంగాణలోకి ప్రవేశిస్తుండటంతో ఆయనే స్వయంగా తనిఖీ చేసి వేబిల్లు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యానికి మద్దతు ధర ఎక్కువ ఉండడంతో అక్కడి రైతులు ఊరు, పేరు మార్చి తప్పుడు వేబిల్లులతో ధాన్యం విక్రయించే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్డీవో కిషోర్‌కుమార్‌, డీఎస్పీ రఘు, గ్రామీణ సీఐ శివరామిరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని