logo
Published : 30/11/2021 03:55 IST

విద్యుదాఘాతంతో ‘హెల్పర్‌’ మృతి

ఘటన ఎలా జరిగిందో తెలియదంటున్న విద్యుత్తు సంస్థ అధికారుల తీరుపై విస్మయం

రిక్కల సురేష్‌

తుంగతుర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన దేవునిగుట్టతండా శివారులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంపటి గ్రామానికి చెందిన రిక్కల సురేష్‌ (26) కొన్నేళ్లుగా విద్యుత్తు సంస్థ ఉద్యోగి వద్ద సహాయకుడి(హెల్పర్‌)గా కూలి తీసుకుంటూ పనిచేస్తున్నారు. గానుగుబండాలో సోమవారం ఉదయం బిల్లులు వసూలు చేసినట్లు సమాచారం. మధ్యాహ్న సమయంలో బ్రేక్‌డౌన్‌ కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు లైన్లను సరిచేసేందుకు వెళ్లారు. దేవునిగుట్టతండా సమీపంలోని ఫీడర్‌ విద్యుత్తు తీగల (జంఫర్‌)ను తొలగించడానికి 11 కేవీకి చెందిన స్తంభం బదులు 33 కేవీకి చెందిన స్తంభం ఎక్కి తీగను పట్టుకోగానే విద్యుదాఘాతం సంభవించి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యుత్తు సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని సురేష్‌ కుటుంబ సభ్యులు విలపించారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు కోరారు. అవసరమున్నంత వరకు అతడి సేవలను వినియోగించుకొని కష్టకాలంలో అండగా ఉండాల్సిన అధికారులు తీరా అతడు మృతి చెందాక ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోకపోగా కనీసం మానవతా దృక్పథంతో మృతదేహాన్ని చూడడానికి రాకపోవడం బాధాకరమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. సురేష్‌కు భార్య మౌనిక, కుమారుడున్నారు. భర్త మృతితో ప్రస్తుతం గర్భిణి అయిన మౌనిక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి ఘటనపై ‘న్యూస్‌టుడే’తో విద్యుత్తు సంస్థ ఏడీఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సురేష్‌ కొంతకాలంగా గానుగుబండ లైన్‌మెన్‌ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న మాట వాస్తవమేనన్నారు. ఏ కారణంగా అతడు 33 కేవీ స్తంభం ఎక్కారో తెలియడం లేదని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో అతడి వెంట ఎవరూ లేరని, ఏమైనా మరమ్మతులు చేయాల్సి వస్తే సంబంధిత లైన్‌మెన్‌కు సమచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని