logo
Published : 30/11/2021 03:55 IST

చిల్లర డబ్బు కోసమే చంపేశారా..?

సత్తయ్య

చింతపల్లి, న్యూస్‌టుడే: ఎవ్వరినీ పట్టించుకోకుండా తనపని తానే చేసుకునే మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. చింతపల్లి మండల కేంద్ర పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన.. అటు కుటుంబ సభ్యులను, ఇటు స్థానికులను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. మతిస్థిమితం లేని వ్యక్తిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరు, ఎందుకు ఈ హత్య చేశారో తేల్చేందుకు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

చింతపల్లి మండల కేంద్రానికి చెందిన కంచుకట్ల సత్తయ్య(56), భార్య యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బతుకుదెరువు కోసం దాదాపు 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఐదేళ్లుగా సత్తయ్యకు మతిస్థిమితం సరిగా ఉండడం లేదు. దీంతో యాదమ్మ హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తుండగా, వారి కుమారుడు సతీష్‌ తాపీమేస్త్రీ పని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మతిస్థిమితం లేని కారణంగా సత్తయ్య హైదరాబాద్‌, చింతపల్లి, తదితర రహదారుల వెంట చిత్తుకాగితాలు సేకరిస్తూ తిరిగేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీషీర్డీసాయిబాబా దేవాలయం సమీపంలో తలపై బండరాయితో మోదడంతో సత్తయ్య అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు చేరుకొని రాత్రి 11.30 సమయంలో రహదారి వెంట నిఘా కేంద్రాలను పరిశీలించినా హంతకుల ఆచూకీ దొరకలేదు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చింతపల్లిలో వివరాలను సేకరిస్తున్న డీఎస్పీ ఆనంద్‌రెడ్డి

ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ

సత్తయ్య తాను సేకరించిన కాగితాలు అమ్మితే ఒక్కోసారి రూ.రెండు వేల వరకూ వచ్చేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సత్తయ్య వద్ద ఉన్న డబ్బులను చూసిన హంతకులు ఆ డబ్బు తీసుకోవడానికే హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర విషయాలను ఏమాత్రం పట్టించుకోని ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘటనా స్థలిని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ సత్యం పరిశీలించి స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.  
 

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని