logo
Published : 30/11/2021 03:55 IST

వివాహిత బలవన్మరణం

దంతాలపల్లి, న్యూస్‌టుడే: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. వాసవి(30)కి నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం కడపర్తి గ్రామానికి చెందిన దాసరి జానయ్యతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. వాసవి ఇటీవల పుట్టింటికొచ్చింది. మతిస్థిమితం కోల్పోవడంతో పాటు అనారోగ్య సమస్యలు తోడవడంతో మనస్తాపంతో మృతురాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం, అనారోగ్య కారణాలే మృతికి కారణమైనట్లు తెలుస్తోందని ఎస్సై మురళీధర్‌రాజు తెలిపారు. అయితే ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.


ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్‌లపై వేటు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: కాసుల కోసం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్‌రిజిస్ట్రార్‌లపై సస్పెన్షన్‌ వేటు కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం మరో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్‌లపై వేటు పడింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అనాథరైజ్డ్‌ రిజిస్ట్రేషన్‌లపై ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినవారిపై వేటు వేస్తున్నారు. సూర్యాపేట సబ్‌రిజిస్ట్రార్‌ మల్లిఖార్జున్‌రావు, మిర్యాలగూడలో కొద్ది రోజుల క్రితం ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీవాణి, జూనియర్‌ అసిస్టెంట్‌ ధరమ్‌సింగ్‌ నాయక్‌లను సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి ఆదేశాలు అందినట్లు జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా రిజిస్ట్రేషన్‌లు చేయకూడదని ఏడాది క్రితం ప్రభుత్వం 257 సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌లకు అప్పట్లో శిక్షణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఉన్న 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొందరు సబ్‌రిజిస్ట్రార్‌లు, ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌లు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా దళారులు, దస్తావేజు లేఖర్ల మాటలు నమ్మి వ్యవసాయ భూములు, గ్రామపంచాయతీ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు చేశారు. నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్లు చేసిన వారిలో వారం రోజుల క్రితం నల్గొండ సబ్‌రిజిస్ట్రార్‌-1 ముమషీర్‌ హైమద్‌, దేవరకొండ ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌ వెంకట్‌రెడ్డిలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో నలుగురిపై వేటు పడే అవకాశాలున్నట్లు తెలిసింది.


ముగ్గురికి రిమాండ్‌

చండూరు, న్యూస్‌టుడే: పుల్లెంల గ్రామంలో ఇటీవల ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత నకిరేకంటి అశ్విని(25) కేసు విషయంలో పోలీసులు సోమవారం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. భర్త వెంకన్నతో పాటు అత్తామామలు లక్ష్మయ్య, చెన్నమ్మలను కేసు దర్యాప్తులో భాగంగా రిమాండ్‌ చేసినట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని