logo
Published : 30/11/2021 03:55 IST

తేనెటీగల పెంపకంతో ఆదాయం: వెంకటరామిరెడ్డి

గడ్డిపల్లి కేవీకేలో తేనెటీగల పెంపకంపై సూచనలు ఇస్తున్న డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి

గడ్డిపల్లి(గరిడేపల్లి), న్యూస్‌టుడే: తేనెటీగల పెంపకంతో ఆదాయం, ఆరోగ్యం వస్తుందని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ ఎల్‌ వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని అరబిందో కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘శాస్త్రీయ పద్దతిలో తేనెటీగల పెంపకం’ అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తేనెటీగల పెంపకాన్ని యువత, రైతులు మంచి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చునని చెప్పారు. ఉద్యానశాఖ పరంగా రాయితీలు అందిస్తామని వివరించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలోని వివిధ ప్రదర్శన క్షేత్రలైనా జీవ ఎరువులు, అజోల్లా, బత్తాయి, మామిడి నర్సరీ, హరిత గృహాలలో కూరగాయల నారు పెంపకం, తేనెటీగల పెంపకం, వర్మి కంపోస్టు, కోడి పిల్లల పెంపకం సందర్శించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సరోజినిదేవి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారిణి సంగీతలక్ష్మి, రవీంద్రకుమార్‌, డైరెక్టర్‌ ఏపీ కల్చర్‌, ఎన్‌ఐఆర్డీ హైదరాబాద్‌ జి. సత్యనారాయణరెడ్డి, లవకుమార్‌, శాస్త్రవేత్తలు నరేష్‌, కిరణ్‌, నరేష్‌, ఆదర్శ్‌, సుగంధి, 25 మంది తేనెటీగ శిక్షణార్థులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని