logo
Published : 30/11/2021 03:55 IST

ఏకతాటిపైకి తెచ్చేలా వ్యూహం..

ఓటర్లతో నియోజకవర్గాల్లో భేటీలకు ప్రణాళిక

ఈటీవీ నల్గొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై సోమవారం అధికార పార్టీ నేతలు సమాలోచనలు జరిపారు.  నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలవాలని నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిర్వహించిన భేటీకి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితోపాటు మూడు జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఓటర్లందరినీ ప్రత్యక్షంగా కలుసుకోవడానికి సెగ్మెంట్ల వారీ భేటీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులంతా ఒక స్థాయి నాయకులే కాబట్టి కూలంకషంగా కాకుండా సమన్వయంతో ఓటు ఎలా వేయాలన్నది చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని సీనియర్‌ నేతలు వ్యక్తపరిచారు. అందరిని ఏకతాటిపైకి తెచ్చేలా భేటీలు సాగాలన్న కాంక్ష వ్యక్తమైంది. స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్న ఇద్దరికి విపక్ష నేతల అండదండలు ఉండటంతో ఆ కొన్ని ప్రాంతాల్లోనైనా వారి ప్రభావం లేని విధంగా చూసుకోవాలన్న భావన వ్యక్తమైంది.

ఈ నియోజకవర్గాల వారీ సమావేశాల్ని మూడు లేదా నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు అభ్యర్థి ఎం.సి.కోటిరెడ్డి హాజరు కానున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఓటర్లందర్నీ సమన్వయం చేసుకునేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో సమావేశాలు ఉండనున్నాయి. అవసరమైతే ఆరో తేదీనాడు భేటీలు జరిపి ఓటర్లందరినీ ఏకతాటిపైకి తేవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎక్కడెక్కడ వీటిని చేపట్టాలనే అంశంపై ఈ మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబరు 7 నుంచి ఓటర్లందర్నీ క్యాంపులకు తరలిద్దామన్న సూచనప్రాయ అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తానికి ఈ నియోజకవర్గ సమావేశాల నిర్వహణ బాధ్యతను ప్రస్తుతం ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని