logo
Updated : 30/11/2021 06:20 IST

సర్దుబాటులో తడబడి

చండూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

చండూరు, న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను కేటాయించడంలో విద్యా శాఖ  విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. సర్దుబాట్లలో సమన్వయం కొరవడటంతో పలు పాఠశాలల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. దీనిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

ఉత్తర్వులు లేకుండానే..  

చండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రామ్మూర్తి అనే ఉపాధ్యాయుడు మునుగోడు మండలంలో ఓ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు, గాయత్రి అనే ఉపాధ్యాయురాలు చింతపల్లి మండలానికి వెళ్లారు. నిజానికి వీరికి ఎలాంటి లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు లేవు. అయినా దొడ్డిదారిలో అక్రమ డిప్యుటేషన్లు పొందినట్లు సమాచారం. వీరికి కొంత మంది అధికారులు కూడా సహకారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి డిప్యుటేషన్లు రద్దు చేయాలని, ఈ వ్యవహారానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు అంతర్గతంగా గట్టిగానే పట్టుబడుతున్నారు తెలిసింది.

సమన్వయలోపమే కారణం.. 

సమన్వయ లోపంతో ఓ చోట ఎక్కువ మరో చోట తక్కువ ఉపాధ్యాయులు ఉండటం, సర్దుబాట్లకు సరైన సహకారం అందించకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. బోడంగిపర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులుండగా 15 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గట్టుప్పల, చండూరు ఉన్నత పాఠశాలల నుంచి ఇద్దరేసి ఉపాధ్యాయులను ఇక్కడికి డిప్యూటేషన్‌ వేసిన వారు రావడానికి సిద్ధంగా లేరు. చండూరు పాఠశాలలోని ఒక ఉపాధ్యాయుడు అక్రమ డిప్యుటేషన్‌ పొందగా మరొక ఉపాధ్యాయురాలు డిప్యుటేషన్‌కు పోకుండా అలాగే పనిచేస్తున్నారు. ఇక గట్టుప్పల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌ రద్దు కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. కొంత మంది ఉపాధ్యాయుల నివాసం హైదరాబాదులో ఉండటంతో రాకపోకలకు అనువైన మార్గంలోని పాఠశాలల్లోనే పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు.

ఉపాధ్యాయులను తిరిగి రప్పిస్తున్నాం - గురువారావు, ఇన్‌ఛార్జి ఎంఈవో, చండూరు

నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌ వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డీఈవో మౌఖిక ఆదేశాలు ఉండటంతోనే తాము వారి డిప్యుటేషన్లను అంగీకరించాం. ఇపుడు అభ్యంతరాలు రావటంతో తిరిగి రప్పిస్తున్నాం. బోడంగిపర్తి ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల కొరత సమస్యను కూడా వెంటనే పరిష్కరిస్తాం.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని