చిత్రవార్తలు
కూటికోసం కోటి తిప్పలు తప్పడం లేదు. బస్సులో వెళ్తే ఛార్జీల భారంతోపాటు, గ్యాసుబండ తీసుకెళ్లేందుకు అనుమతులుండవు. దీంతో చేసేదేమీ లేక తమకున్న ద్విచక్రవాహనంపై ఇనుప మంచాన్ని కట్టుకొని దానిపై గ్యాసుబండను పెట్టుకొని తమ చంటి
బతుకు తిప్పలు.. తప్పని ప్రయాణం
కూటికోసం కోటి తిప్పలు తప్పడం లేదు. బస్సులో వెళ్తే ఛార్జీల భారంతోపాటు, గ్యాసుబండ తీసుకెళ్లేందుకు అనుమతులుండవు. దీంతో చేసేదేమీ లేక తమకున్న ద్విచక్రవాహనంపై ఇనుప మంచాన్ని కట్టుకొని దానిపై గ్యాసుబండను పెట్టుకొని తమ చంటి బిడ్డను ఒడిలో కూర్చోపెట్టుకొని భార్యాపిల్లలతో ప్రయాణించారు. ఖమ్మం శివారు ప్రాంతం నుంచి సూర్యాపేట దగ్గరలో ఓ ఇటుక బట్టీలో పనిచేసేందుకు వలస వెళ్తున్న వారి చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ బుధవారం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం రహదారిపై తన ఛాయాగ్రాహకంలో బంధించింది.
- న్యూస్‌టుడే, తిరుమలాయపాలెం
తీరా దగ్గరికెళ్తే.. ఒళ్లు జల్లు!
నిత్యం భారీ వాహనాలు దూసుకెళ్లే జాతీయ రహదారి మార్జిన్ ప్రమాదకరంగా తయారైంది. కొత్తగూడెం శివారు లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బీ వంతెన ఆనుకుని రోడ్డు ధ్వంసమైంది. తీరా దగ్గరకు వచ్చి చూస్తే గానీ అక్కడ అంచు దెబ్బతిన్నట్లు కనిపించడం లేదు. ఏ మాత్రం మార్జిన్ దిగినా పక్కనున్న వాగులోకి వాహనాలు దూసుకెళ్లేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లెందు క్రాస్ రోడ్డు, పాల్వంచ వైపు నుంచి విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే పలు వాహనాలు ఈ మార్గం మీదుగా వస్తుంటాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న మార్గంలో ప్రమాదాలకు తావులేకుండా సమస్యను పరిష్కరించి రక్షణ గోడ ఏర్పాటు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
మార్జిన్లో ప్రమాదకరంగా ఉన్న రోడ్డు
- కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్‌రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు