logo

‘కట్ట’కటా.. కుంగిపోతున్నా పట్టదా?

నగరంలోని ప్రకాశ్‌నగర్‌ మున్నేటి చెక్‌డ్యామ్‌ వద్ద నిర్మించిన కట్ట రోజురోజుకు కుంగిపోతూ ప్రమాదకరంగా మారుతోంది. లక్షల రూపాయల వ్యయంతో పోసిన కట్టపై పచ్చదనం కనుమరుగు కావడంతో సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 27 Jan 2022 03:58 IST

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే

ప్రకాశ్‌నగర్‌ మున్నేటి చెక్‌డ్యామ్‌ వద్ద ప్రమాదకరంగా తయారైన కట్ట

నగరంలోని ప్రకాశ్‌నగర్‌ మున్నేటి చెక్‌డ్యామ్‌ వద్ద నిర్మించిన కట్ట రోజురోజుకు కుంగిపోతూ ప్రమాదకరంగా మారుతోంది. లక్షల రూపాయల వ్యయంతో పోసిన కట్టపై పచ్చదనం కనుమరుగు కావడంతో సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిని నగరపాలక సంస్థ, సాగు నీటి పారుదల శాఖల్లో ఎవరు నిర్వహిస్తున్నారన్న విషయంలో అయోమయం నెలకొంది. ఈ కట్ట చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. దాన్ని వ్యూపాయింట్‌ చేసుకుని సందర్శకులు స్వీయచిత్రాలు దిగుతున్నారు. ఇక్కడి నుంచి కాల్వ చప్టా చూడొచ్చు. ఇదిలా ఉంటే హరితహారం కార్యక్రమంలో భాగంగా దీనిపై పలు రకాలు మొక్కలు నాటారు. అటుపై ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి ఎండిపోయాయి. ప్రస్తుతం అనవాళ్లు కూడా కన్పించడంలేదు. పచ్చదనం పూర్తిగా హరించుకుపోవడం, కట్ట ఎక్కే భాగంలో మట్టి కోతకు గురవడం సందర్శకుల్లో ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత అధికారులు దానిని పరిశీలించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని