logo

‘రామచంద్రయ్య విశిష్టతను మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం’

‘కంచుతాళం- కంచుమేళం’ వాద్య సాధనంతో 20 ఏళ్లుగా ఆదివాసీ సంస్కృతిని చాటుతూ నేడు పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న సకిని రామచంద్రయ్య జీవితానికి సంబంధించిన విశిష్టతను సీడీలు, రచనల రూపంలో గిరిజన మ్యూజియంలో

Published : 27 Jan 2022 03:58 IST

రామచంద్రయ్యను సన్మానిస్తున్న ఐటీడీఏ అధికారులు డేవిడ్‌ రాజ్‌, రమాదేవి తదితరులు

మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ‘కంచుతాళం- కంచుమేళం’ వాద్య సాధనంతో 20 ఏళ్లుగా ఆదివాసీ సంస్కృతిని చాటుతూ నేడు పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న సకిని రామచంద్రయ్య జీవితానికి సంబంధించిన విశిష్టతను సీడీలు, రచనల రూపంలో గిరిజన మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ సహాయక ప్రాజెక్టు అధికారి జనరల్‌ డేవిడ్‌ రాజ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ రమాదేవి అన్నారు. బుధవారం మణుగూరులోని కూనవరంలో పద్మశ్రీ రామచంద్రయ్యను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షరాస్యుడైన రామచంద్రయ్య అరుదైన వాద్య పరికరంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి కోయ తెగల చరిత్రను ప్రజలకు వినిపించేవారన్నారు. ఏవో భీం, ఏసీఎంవో రమణయ్య, ఏటీడీవో నర్సింహారావు, గిరిజన మ్యూజియం ప్రతినిధి వీరస్వామి, ఎంటీఆర్‌డీ వెంకటేశ్వర్లు, హెచ్‌వో క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని