logo

'భావితరాలకు ఆదర్శంగా నిలవాలి`

న్యాయవాదులు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని

Published : 27 Jan 2022 03:58 IST

జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి చంద్రశేఖరప్రసాద్‌

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: న్యాయవాదులు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో న్యాయమూర్తి జాతీయ జెండా ఆవిష్కరించి న్యాయవాదులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం సక్రమ మార్గంలో నడవాలంటే న్యాయవాదులు చేసే కార్యక్రమాలు ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. న్యాయమూర్తులు డానీరూత్‌, శ్యాంశ్రీ, అక్తర్‌, శ్రీనివాస్‌, జావీద్‌పాషా, అనితారెడ్డి, శాంతిసోనీ, మౌనిక, పూజిత, భారతి, బార్‌ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.గురుమూర్తి, కార్యదర్శి కోనా చంద్రశేఖర్‌, ఇమ్మడి లక్ష్మీనారాయణ, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కొల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.


జిల్లా పరిషత్తులో..

కలెక్టరేట్‌లో జెండా వందనం చేస్తున్న టీఎన్జీవో ఉద్యోగులు

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఛైర్మన్‌ కమల్‌రాజు పాల్గొనగా జడ్పీ సీఈవో అప్పారావు జాతీయ జెండా ఎగుర వేశారు. గాంధీ విగ్రహానికి జడ్పీ ఛైర్మన్‌, సీఈవో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉప సీఈవో చంద్రశేఖర్‌, తల్లాడ జడ్పీటీసీ ప్రమీల, ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను జడ్పీ ఛైర్మన్‌ ఆవిష్కరించి, వందనం చేశారు. కలెక్టరేట్‌లో టీఎన్జీవో నాయకులు జాతీయ పతాకాన్ని ఎగరేశారు.


పరిమిత సంఖ్యలో..

జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలో ఆహుతుల మధ్య భారత 73వ గణతంత్ర దినోత్సవం కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. అంతకు ముందు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌, డీఆర్వో శిరీష, ఖమ్మం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఖజానా అధికారి సత్యనారాయణ, సీపీవో శ్రీనివాస్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రాము, ఆర్డీవో రవీంద్రనాథ్‌, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శైలజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని