logo

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

అంతర్‌ జిల్లా దొంగల ముఠా సభ్యుడిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకొని శుక్రవారం రిమాండుకు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల

Published : 22 Jan 2022 03:30 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పక్కన ఏఎస్పీ అన్యోన్య, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సదాశివనర్‌ సీఐ రామన్‌, ఎస్సై శేఖర్‌  

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: అంతర్‌ జిల్లా దొంగల ముఠా సభ్యుడిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకొని శుక్రవారం రిమాండుకు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా టరోడా తాలూకా గౌతంనగర్‌ సాంగ్వి గ్రామానికి చెందిన మంగళ్‌ ధ్యానేశ్వర్‌ చౌహాన్‌ ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం చాటతండాలో నివాసముంటున్నాడు. పద్మాజివాడి అడ్డరోడ్డు వద్ద ఈ నెల 20న అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. అతను చేసిన నేరాలను అంగీకరించగా శుక్రవారం రిమాండుకు తరలించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పోసాని శ్రీనివాస్‌ ఇంట్లో(30-11-2020), నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకొన్నాడు. ఈ మేరకు అతని నుంచి రూ.3.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు చోరీల్లో అతనికి తోడుగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన చంద్రాపూర్‌ జిల్లా రాజురా తాలూకా అర్వి గ్రామానికి చెందిన బన్నీ అలియాస్‌ విలాస్‌ ప్రకాష్‌ చౌహాన్‌, జయరామ్‌ రాఠోడ్‌ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారిద్దరూ పరారీలో ఉన్నారన్నారు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతంగా చేపట్టామన్నారు. ఆయుధాలతో కూడిన మొబైల్‌ హైవే పెట్రోలింగ్‌ పార్టీలతో దొంగతనాలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సదాశివనగర్‌ సీఐ, ఎస్సైలు రామన్‌, శేఖర్‌, సీసీఎస్‌ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై ఉస్మాన్‌, సయీద్‌, గణపతి, గణేశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని