logo

ట్రాక్టర్‌ ట్రాలీ దొంగల ముఠా అరెస్టు: డీఎస్పీ

జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొలాల వద్ద, కాల్వ కట్టలపై ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగతనం చేస్తున్న ముఠాలో ఐదుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Published : 22 Jan 2022 03:42 IST


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొలాల వద్ద, కాల్వ కట్టలపై ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగతనం చేస్తున్న ముఠాలో ఐదుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. వారి నుంచి ఐదు ట్రాలీలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు అనుమానితులు కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పట్టణంలోని ఏఆర్‌నగర్‌కు చెందిన దుంప సంపత్‌, కట్టంగూరు మండలం పిట్టంపల్లికి చెందిన సురిగి మధు, పానగల్‌కు చెందిన ఆలకుంట్ల వెంకన్న, ఖమ్మం పట్టణానికి చెందిన ఓర్సు రామకృష్ణ, దుబ్బల రఘులతోపాటు పరారీలో ఉన్న ఏఆర్‌నగర్‌కు చెందిన దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజులు కలిసి కొంత కాలంగా ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగతనం చేసి వచ్చిన నగదుతో సరదాలు చేస్తున్నారు. పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు ట్రాలీలను ఎత్తుకెళ్లారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు, సీసీఎస్‌ సీఐ అనిల్‌, ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని