logo

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మొగల్తూరు మండలం కాళీపట్నంపడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు తులసి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద

Published : 22 Jan 2022 01:45 IST


అశ్విని (పాత చిత్రం)

మొగల్తూరు, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మొగల్తూరు మండలం కాళీపట్నంపడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు తులసి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్విని(25)సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రస్తుతం ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెకు దిరుసుమర్రు గ్రామానికి చెందిన వేండ్ర రామకృష్ణతో ఆరు నెలల కిందట వివాహమైంది. ఈ నెల 20న భర్త హైదరాబాదు వెళ్లిన అనంతరం అశ్విని అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద కనిపించలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా ముత్యాలపల్లి-కొత్తోట గ్రామాల మధ్య ఉప్పుటేరు వంతెనపై అశ్విని ద్విచక్ర వాహనం, సామగ్రిని గుర్తించారు. అనుమానంతో ఉప్పుటేరులో గాలించగా మృతదేహం లభ్యమైంది. ఏడాది కిందటే తండ్రి ధర్మారావు కరోనాతో మృతిచెందారు. దీనికి సంబంధించి మృతురాలి తల్లి పోలీసులకు ఫిిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తహశీల్దారు హుస్సేన్‌ పర్యవేక్షణలో పంచనామా చేశారు.శవాన్ని పరీక్ష నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని