logo
Published : 01/12/2021 04:11 IST

మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు

అరెస్టును చూపుతున్న ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ చిత్రంలో సీఐ, ఎస్సై

చర్ల, న్యూస్‌టుడే: చర్లలో నలుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ వివరాలను వెల్లడించారు. చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌, 204 కోబ్రా బలగాల ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బీజాపూర్‌ జిల్లా ఊసూరు మండలం పావురుగూడ, గుంజెపర్తికి చెందిన సోడి సోనా, సోడి సోనూ, సోడి ఉర్ర, మడకం సందీప్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వీరు మావోయిస్టు ఊసూరు ఏరియా కమిటీలో సానుభూతిపరులుగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఏఎస్పీ పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి మావోయిస్టు చర్ల-శబరి ఏరియా కమిటీ పేరుతో ఉన్న పీఎల్‌జీఏ 21వ వారోత్సవాలకు సంబంధించిన 20 కరపత్రాలు, 30 కిలోల బియ్యం సంచులు పదింటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఐ అశోక్‌, ఎస్సై రాజువర్మ పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని