logo
Published : 01/12/2021 03:12 IST

జిల్లాలో వైద్య పరిశోధన బృందం పర్యటన

బెంగళూరు ప్రొఫెషనల్‌ బృందంతో పాల్వంచ సీహెచ్‌సీ వైద్యులు

కొత్తగూడెం వైద్యవిభాగం, పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: సెంట్రల్‌ బ్యూరో హెల్త్‌ ఇన్వెస్టిగేషన్‌ గణాంకాధికారి టి.రామారావు, సందీప్‌ ప్రసాద్‌ బృందం జిల్లాలో మంగళవారం పర్యటించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి, పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రం, జగన్నాథపురం, భద్రాచలం పలు ఆసుపత్రులను సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి కొనసాగుతున్న ప్రక్రియపై ఆరా తీశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శిరీష అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల వివరాలు, పంపిణీ చేసిన మందులను అంతర్జాలంలో తప్పనిసరిగా నమోదు చేయాలని బృందం సభ్యులు సూచించారు. పాల్వంచ సీహెచ్‌సీలో పర్యటించి ఆసుపత్రి పనితీరు మెరుగ్గా ఉందని ప్రశంసించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వినోద్‌, ఎంసీహెచ్‌ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ సుజాత, ఆర్‌ఎంవో డా.నవీన్‌, డిప్యూటీ ఎస్‌ఓ ఇ.ఇనోక్‌, ఏఎస్‌ఓ హరినాధ్‌బాబు, చార్లెస్‌, సోమరాజుదొర, రాంబాబు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని