logo
Published : 01/12/2021 03:12 IST

ఎమ్మెల్సీ ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి: కలెక్టర్‌

బ్యాలెట్‌ పెట్టెను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు అవగాహన చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ గౌతమ్‌ సూచించారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నియమితులైన ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌, సెక్టోరల్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందికి మంగళవారం మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఎన్నిసార్లు విధులు నిర్వహించినా, ప్రతి ఎన్నిక కొత్త అనుభవాన్ని ఇస్తుందని, పోలింగ్‌ విధులను అప్రమత్తంగా నిర్వర్తించాలన్నారు. చిన్న పొరపాటు జరిగినా రీ పోలింగ్‌కు దారి తీస్తుందన్నారు. బ్యాలెట్‌ పెట్టెలు సీల్‌ చేయటం, పేపర్‌ సీల్‌ వేయటం, పోలింగ్‌ కేంద్రంలో అనుమతించే వ్యక్తులు, బ్యాలెట్‌ పేపర్‌ సీక్రసీ, పోలింగ్‌ ఫారాలు పూర్తి చేయటం తదితర అంశాలపై కలెక్టర్‌ ఆచరణాత్మకంగా చేయించారు. డిసెంబరు 6న రెండో విడత శిక్షణ ఉంటుందని వెల్లడించారు. మాస్టర్‌ ట్రైనర్‌ శైలేంద్ర, నాగిరెడ్డి, నోడల్‌ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ పలు అంశాలపై బోధించారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, ఎన్నికల డీటీ రాంబాబు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని