logo
Published : 01/12/2021 03:12 IST

ఉభయ జిల్లాల వారధి.. ఎవరు దారి చూపేది? 

ఏన్కూరు, న్యూస్‌టుడే

గుంతలమయంగా కేసుపల్లి- పాపకొల్లు రహదారి

పాలకులు కరుణిస్తే అది రెండు జిల్లాలను, అదే తరహాలో రెండు మండలాలను కలిపే రహదారిగా మారుతుంది. ఏళ్లుగా విన్నవిస్తున్నా సమస్యను పరిష్కరించే వారే కరవయ్యారు. పది కిలోమీటర్ల ‘కేసుపల్లి- పాపకొల్లు’ రహదారి పరిస్థితి ఇది.

ఖమ్మం జిల్లాలో చివరి గ్రామమైన ఏన్కూరు మండలం కేసుపల్లి నుంచి భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు వరకు రహదారి నిర్మిస్తే రాకపోకలు సులువుగా ఉంటాయి. ఏన్కూరు మండలం బురద రాఘవాపురం, కేసుపల్లి మీదుగా పాపకొల్లుకు రహదారి మంజూరు చేస్తే చుట్టుపక్కల వారు కొత్తగూడేనికి తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాపకొల్లు, రాజారావుపేట, బేతాళపాడు పరిసర గ్రామాల ప్రయాణికులు ఖమ్మం వెళ్లేందుకు సులువవుతుంది. ప్రస్తుతం పాపకొల్లు నుంచి జూలూరుపాడు, ఏన్కూరు మీదుగా ఖమ్మం వెళ్లేందుకు 70 కి.మీ. ప్రయాణించాలి. అదే కేసుపల్లి మీదుగా రహదారి ఉంటే 50 కిలోమీటర్ల ప్రయాణంతో గమ్యంచేరొచ్చు. ఏన్కూరు మండలంలో తిమ్మారావుపేట, పరిసర వాసులకూ కొత్తగూడెం వెళ్లడం దగ్గరవుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.

నడకే యాతన..

కేసుపల్లి నుంచి పాపకొల్లు, బురద రాఘవాపురం వెళ్లేందుకు గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ భూములు ఆ మార్గంలోనే ఉన్నాయి. మట్టి దారిలో గోతులు, ముళ్లపొదల మధ్య ఇబ్బందిపడుతున్నారు. ట్రాక్టర్లు, ఆటోల్లో వెళ్లాలంటే కష్టంగా ఉంది. గతంలో కొంతవరకు మెటల్‌ రహదారి ఉన్నా వరదలకు కొట్టుకపోయింది.


‘‘కేసుపల్లి - పాపకొల్లు రహదారి సమస్యను నా దృష్టికి తెచ్చారు. రహదారికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాము. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తా.’’

లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్యే వైరా
 

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని