logo
Published : 01/12/2021 03:12 IST

ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయి?

 ఎమ్మెల్యే సండ్రకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

ఈటీవీ, ఖమ్మం: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొనుగోళ్లు సాగుతున్న తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఫోన్‌ చేశారు. వరి సాగు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన సత్తుపల్లిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి? క్షేత్ర స్థాయి ఇబ్బందులున్నాయా? అని ఆరా తీశారు. రవాణాలో ఇబ్బందులు, తేమ శాతం రాక రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సీఎం దృష్టికి సండ్ర తీసుకొచ్చారు. ధాన్యం రవాణాకు సంబంధించి టెండర్లు ఎఫ్‌సీఐ ఆలస్యం చేసిందని వివరించారు. స్పందించిన సీఎం ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశం మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సండ్రతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని