logo
Updated : 01/12/2021 06:24 IST

ఉన్నత లక్ష్యంతో పాటు ఉత్తమ విలువలు అవసరం

తెలుగు భాషోద్యమ ప్రచారకుడు కోట పురుషోత్తంను సన్మానిస్తున్న ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌

కళాశాల ప్రధానాచార్యుల జకీరుల్లా, అధ్యాపకులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉన్నత లక్ష్యంతో పాటు ఉత్తమమైన విలువలు ప్రతి మనిషికి అవసరమని, విద్యార్థులు విలువల ప్రాతిపదికగా జీవితాలను సరిదిద్దుకోవాలని ప్రముఖ తెలుగు భాషా పరిరక్షక, తెలుగు భాషోద్యమ ప్రచారకులు, తిరుపతికి చెందిన కోట పురుషోత్తం అన్నారు. ఖమ్మం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘పద్య పరిమళం-వ్యక్తిత్వ వికాసం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు నిరంతరం చదివితే వచ్చేది జ్ఞానం, సాధన చేస్తే వచ్చేది నైపుణ్యమని పేర్కొన్నారు. పద్యం చదవటం వల్ల జ్ఞాపక శక్తి, శబ్దసంపద, వాక్య నిర్మాణం పెంచుకునేందుకు దోహదపడుతుందన్నారు. పద్య పఠనం వల్ల కలిగే ఉపయోగాలను తాను రాసిన పద్యాలను రాగయుక్తంగా పాడి వివరించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు డాక్టర్‌ మహమ్మద్‌ జకీరుల్లా, తెలుగుశాఖాధిపతి డా. జె.రమేశ్‌, తెలుగు అధ్యాపకుడు డా. సీతారామ్‌, అధ్యాపకులు అనూరాధ, రవికుమార్‌, మేఘమాల, లక్ష్మీకాంతం పాల్గొన్నారు. 

* ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘తెలుగు భాష ప్రాధాన్యత-వ్యక్తిత్వ వికాసం’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కోట పురుషోత్తం ప్రసంగిస్తూ నిఘంటువు ద్వారా భాష మీద పట్టు వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు డాక్టర్‌ జి.పద్మావతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని