logo
Published : 01/12/2021 03:12 IST

మార్కెట్‌ యార్డులో గుండెపోటుతో హమాలీ మృతి

 న్యాయం చేయాలంటూ రాస్తారోకో

సంజీవ

జూలూరుపాడు, న్యూస్‌టుడే: జూలూరుపాడు ఉప మార్కెట్‌ యార్డులో మంగళవారం హమాలీ గుండెపోటుతో మృత్యువాత పడటం ఉద్రిక్తతకు దారితీసింది. జూలూరుపాడు న్యూకాలనీకి చెందిన పప్పుల సంజీవ(60) ఉదయం విధులకు హాజరైన కొద్దిసేపటికే కుప్పకూలిపోయారు. మార్కెట్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనే సంజీవ మృతి చెందాడని ఆరోపిస్తూ హమాలీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కార్మిక, రైతు సంఘాల నేతలు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఎన్డీ, భాజపా, బీఎస్పీ నాయకులు సైతం యార్డుకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులకు ఉద్యోగం, రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సమీపంలోని ప్రధాన రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేశారు. దీంతో గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు చేరుకుని వారిని వారించే ప్రయత్నం చేసినా వినలేదు. ఏన్కూరు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు  జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. మృతదేహంతో మరోమారు రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. సీఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఖమ్మం, కొత్తగూడెం  మార్కెట్‌ల అధికారులు నాగరాజు, అలీమ్‌ఖాన్‌లు యార్డుకు వచ్చారు. కుటుంబలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, పరిహారం విషయమై కలెక్టర్‌కు నివేదిస్తామని కొత్తగూడెం మార్కెట్‌ అధికారి అలీమ్‌ఖాన్‌ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న హమాలీలు, వివిధ సంఘాల నాయకులు

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని