logo
Published : 01/12/2021 03:12 IST

కనుల పండువగా రాముని కల్యాణం

రాముణ్ని దర్శించుకున్న స్పీకర్‌ తమ్మినేని

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ప్రధాన ఆలయంలో కొలువైన కోదండరాముడికి అర్చకులు సుప్రభాతం పలికి నామార్చనలు పఠించారు. ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపం వద్ద నిత్య కల్యాణం కమనీయంగా నిర్వహించారు. చిత్రకూట మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా కొనసాగించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా కలెక్టర్‌ వినీత్‌ నందన్‌వార్‌ రాముణ్ని దర్శించుకుని పూజలు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో వచ్చి రాముణ్ని దర్శించుకున్నారు. ఈవో శివాజీ సాదరంగా స్వాగతం పలికి జ్ఞాపిక అందించారు. తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలనే అంశంపై మాట్లాడుతూ ఇది చర్చల ద్వారా పరిష్కరించుకునేదని అన్నారు. దర్శనం తర్వాత కురిచేటి రాము ఇంటికి వెళ్లగా పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఆలయంలో ఆంజనేయస్వామి అలంకరణను ఆలస్యంగా చేయడంతో కొద్దిసేపు స్పీకర్‌ వేచి ఉండాల్సి వచ్చింది.

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: పర్ణశాల రామాలయాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంగళవారం సందర్శించారు. అనంతరం ఆలయ అర్చకులు స్పీకర్‌ దంపతుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచవటి కుటీరం, సీతమ్మ నారచీరల ప్రదేశాలను తిలకించి పర్ణశాల ప్రాశస్త్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో సీఐ నలగట్ల వెంకటేశ్వర్లు, గిర్దావర్‌ ఆదినారాయణ, వీఆర్వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని