logo
Published : 01/12/2021 03:12 IST

రైతుల ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలు

ఏఐకేఎస్‌ జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ

మహాసభలో మాట్లాడుతున్న పద్మ

బోనకల్లు, న్యూస్‌టుడే: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారానికి కదలాలని ఏఐకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపునిచ్చారు. మంగళవారం బోనకల్లులో మందడపు నాగేశ్వరరావు ప్రాంగణంలో జరిగిన రైతు సంఘం 20వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. మోదీతో వ్యవసాయ రంగానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సాగు చట్టాలను తీసుకొచ్చారని, రైతు ఉద్యమంతో చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. ఏదో రూపంలో వీటిని తీసుకొచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ... పంటల్ని కొనాల్సిన పాలకులే నిరసనలు, ఉద్యమాలు చేస్తే ఇక దిక్కెవరని ప్రశ్నించారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మిడికంటి వెంకటరెడ్డి, సీనియర్‌ నాయకులు అడపా రామకోటయ్య, మందడపు రాణి, ఏపూరి లతాదేవి, దొండపాటి రమేశ్‌, ఆహ్వాన సంఘ అధ్యక్షుడు తోట రామాంజనేయులు, ఎంగల ఆనందరావు, జక్కా నాగభూషణం పాల్గొన్నారు. మహాసభకు ముందు రామకోటయ్య రైతు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని