logo
Published : 01/12/2021 03:12 IST

సీపీఎం జిల్లా కార్యదర్శిగా నున్నా

ఉత్సాహంగా ముగిసిన పార్టీ మహాసభలు

నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులతో తమ్మినేని

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: జిల్లా సీపీఎం నూతన కార్యదర్శిగా నున్నా నాగేశ్వరరావు రెండోసారి ఎన్నికయ్యారు. నగరంలోని ఎంబీగార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభలు ఉత్సాహపూరిత వాతావరణంలో రెండోరోజు మంగళవారం ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్‌, పోతినేని సుదర్శన్‌రావు, ఎం.సాయిబాబు పర్యవేక్షణలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గతంలో జిల్లా కమిటీలో 37 మంది ఉండేవారు. ఈసారి ఆ సంఖ్యను 45కు పెంచారు.

జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు: నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్‌, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కల్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేశ్‌, భూక్యా వీరభద్రం, కొత్తగా చింతలచెర్వు కోటేశ్వరరావు, బొంతు రాంబాబు, వై.విక్రమ్‌కు చోటు కల్పించారు. జిల్లా కమిటీ సభ్యులుగా 34మందిని నియమించారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని