logo
Published : 01/12/2021 03:12 IST

రక్తదానం మహోన్నతమైంది: సీపీ

రక్తదాతకు ధ్రువపత్రాన్ని అందిస్తున్న సీపీ విష్ణు వారియర్‌, ఆర్టీసీ అధికారులు

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: రక్తదానం ఎంతో మహోన్నతమైనదని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. ఖమ్మం కొత్తబస్టాండులో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన సీపీ మాట్లాడారు. అనంతరం ఆర్‌ఎం, డీవీఎంతో సహా రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో మొత్తం 467 మంది రక్తదానం చేశారు. వారిలో 160 మంది ఆర్టీసీ ఉద్యోగులుండగా, 307 మంది ఇతరులు ఉన్నారు. డీటీవో కిషన్‌రావు, ఆర్‌ఎం సొలోమన్‌, డీవీఎం సుగుణాకర్‌, వైద్యాధికారి డాక్టర్‌ గిరిసింహారావు, డీఎం, ఉద్యోగులు, ఐఆర్‌ఎస్‌ బాధ్యులు డాక్టర్‌ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని