logo
Updated : 01/12/2021 04:07 IST

సంక్షిప్త వార్తలు

11,796 మందికి కొవిడ్‌ టీకాలు పంపిణీ

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 11,796 మందికి కొవిడ్‌ టీకా అందజేసినట్లు వైద్యారోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. మొదటిడోసు-3376, రెండోడోసు-8420 మంది స్వీకరించినట్లు వెల్లడించింది.

4 పాజిటివ్‌ కేసులు.. జిల్లాలో 4617 మందికి కరోనా పరీక్షలు చేయగా 4 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంగళవారం నివేదికలో పేర్కొంది.


పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలి

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీపీ విష్ణు ఎస్‌. వారియర్‌ డీజీపీకి వివరించారు. డీసీపీ నాయక్‌, ఏడీసీపీలు బోస్‌, ప్రసాద్‌, కుమారస్వామి, ఏసీపీలు ఆంజనేయులు, ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.


విద్యుత్తు శాఖ అధికారుల విస్తృత తనిఖీలు

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాచలం డివిజన్‌లో విద్యుత్తు శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి అక్రమ విద్యుత్తు వాడకందారుల నుంచి రూ.1,05,000 అపరాధ రుసుము వసూలు చేసినట్లు డీఈ జీవన్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన 46 మందిపైౖ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


మూడు బియ్యం లారీలు పట్టివేత

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ వద్ద పోలీసులు ఏకకాలంలో రేషన్‌ బియ్యంతో వెళుతున్న మూడు లారీలను పట్టుకున్నారు. ఒక్కో లారీలో 500 బస్తాల్లో 25 టన్నుల బియ్యం ఉన్నట్లు సమాచారం. ఈ మూడు లారీలు ఒకేసారి ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి బయలుదేరి కాకినాడ పోర్టుకు వెళుతున్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాలతో హనుమాన్‌జంక్షన్‌ సీఐ కె.సతీష్‌ తన సిబ్బందితో పక్కాగా నిఘా ఏర్పాటు చేసి ఈ లారీలను పట్టుకున్నారు.  


‘నవోదయ’ దరఖాస్తు గడువు పొడిగింపు

కూసుమంచి, న్యూస్‌టుడే: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2022-23 విద్యాసంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు విద్యాలయం ప్రధానాచార్యులు చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.


కాన్పుల విభాగాన్ని పరిశీలించిన యూపీ బృందం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని కాన్పుల విభాగాన్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైద్య నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది. సాధారణ పురుళ్లు పెంచడానికి తీసుకుంటున్న చొరవ గురించి దగ్గరుండి పర్యవేక్షించారు. గర్భిణులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. యూపీ వైద్యనిపుణులతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఎన్‌హెచ్‌ఎం బృందం ఇక్కడకు వచ్చినట్లు డీసీహెచ్‌ఎస్‌ డా.ముక్కంటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.రామకృష్ణ తెలిపారు. అపర్ణ, డా.అర్చన తదితరులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని