logo

జిల్లాలో రెండో డోసు అర్హుల గుర్తింపు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైద్యాధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో టీకాలు వేసుకోని వారిని ఒప్పిస్తూ రెండో

Published : 07 Dec 2021 06:15 IST

మల్యాల, న్యూస్‌టుడే: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైద్యాధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో టీకాలు వేసుకోని వారిని ఒప్పిస్తూ రెండో డోసు వేసే ప్రయత్నంలో ఉన్నారు. జగిత్యాల జిల్లాలో సోమవారం వరకు 15 మండలాల పరిధిలో కొవీషీల్డ్‌ వేసుకోనివారు 3,879 మంది, కొవాగ్జిన్‌ వేసుకోనివారు 2,135 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో రెండు టీకాలు తీసుకోనివారు ధర్మారం మండలంలో 1520, గొల్లపెల్లిలో 1942, ఇబ్రహీంపట్నంలో 1532, జగిత్యాలలో 8007, కథలాపూర్‌లో 3654, కొడిమ్యాలలో 1793, కోరుట్లలో 3007, మల్లాపూర్‌లో 1529, మల్యాలలో 1467, మేడిపెల్లిలో 870, మెట్‌పల్లిలో 3822, పెగడపెల్లిలో 980, రాయికల్‌లో 2253, సారంగాపూర్‌లో 1694, వెల్గటూర్‌లో 944 ఉన్నట్లు గుర్తించారు. టీకాలు వేసుకోని జాబితాలో కొందరు వేరే ప్రాంతాలో, మరికొందరు విదేశాల్లో నివసించేవారు అక్కడే వేసుకున్నారని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. అన్ని గ్రామాల్లో వందశాతం కొవిడ్‌ టీకాలు వేయించడానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అర్హులందరికీ టీకాలు వేయించడానికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని