logo

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే మేలు

ఎఫ్‌సీఐలో ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉండడంతో ప్రభుత్వం యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసినందున రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయడం మేలని జిల్లా కలెక్టర్‌ రవి రైతులకు సూచించారు.

Published : 07 Dec 2021 06:15 IST


చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ రవి

ఇబ్రపీీాంపట్నం, న్యూస్‌టుడే: ఎఫ్‌సీఐలో ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉండడంతో ప్రభుత్వం యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసినందున రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయడం మేలని జిల్లా కలెక్టర్‌ రవి రైతులకు సూచించారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో పంట మార్పిడి, సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో సోమవారం పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, అమ్మక్కపేట్‌, గోధూర్‌ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాకు 40.650 కిలోలు మాత్రమే తూకం వేయాలని, తాలు, తప్ప పేరుతో ఎక్కువ తూకం వేస్తే చర్యలు తప్పవన్నారు. ఆర్డీవో వినోద్‌ కుమార్‌, డీర్‌డీవో పీడీ వినోద్‌, జిల్లా వ్యవసాయాధికారి సురేశ్‌ కుమార్‌, డీసీవో రామానుజచారి, సర్పంచి లత, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో ప్రభు, మండల వైద్యాధికారి వనజ, తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్‌: రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన మినుములు, పెసర్లు, నువ్వు పంటను సాగుచేసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరుపుతామని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేట, సాతారం గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. తహసీీల్దార్‌ రవీందర్‌, ఎంపీీడీవో రాజశ్రీనివాస్‌, వ్యవసాయాధికారిణి లావణ్య, డీసీీవో రామానుజం, తదితరులు పాల్గొన్నారు.

గల్ఫ్‌ కుటుంబాలకు పరిహారం చెల్లింపు

జగిత్యాల: ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి సోమవారం పరిహారం అందించారు. మేడిపల్లి మండలం బీమారం గ్రామానికి చెందిన చిలువేరి గంగరాం వివిధ కారణాలతో మృతి చెందగా అతని భార్య హన్మక్క రూ.3.24 లక్షలు, అతని కుమారుడు గంగాధర్‌కు రూ.1.53 లక్షల చెక్కులను కలెక్టర్‌ అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని