logo

బడి పక్కనే.. అంగన్‌వాడీ

అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చాలని.. తద్వారా చిన్నారులను ప్రాథమిక విద్యకు మానసికంగా సంసిద్ధం చేసేందుకు వీలువుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్యాచరణ ప్రారంభించాలని

Published : 07 Dec 2021 05:58 IST

చిన్నారులను పాఠశాలకు అలవాటు చేయాలని నిర్ణయం

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు (పాత చిత్రం)

కరీంనగర్‌ మంకమ్మతోట, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చాలని.. తద్వారా చిన్నారులను ప్రాథమిక విద్యకు మానసికంగా సంసిద్ధం చేసేందుకు వీలువుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్యాచరణ ప్రారంభించాలని జిల్లా అధికారులకు సైతం ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై మరింత పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. పూర్వ ప్రాథమిక విద్య చదివిన వారిలో సింహ భాగం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే చేరితే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

లబ్ధిదారులకు తప్పని దూర భారం

ప్రభుత్వ తాజా నిర్ణయంతో పట్టణ ప్రాంతంలోని కేంద్రాల లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పకపోవచ్ఛు కరీంనగర్‌ అర్బన్‌, హుజూరాబాద్‌ లాంటి పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ తాజా నిర్ణయంతో ఆ కేంద్రాలు పాఠశాలల్లో విలీనం చేయాలి. అలా చేస్తే లబ్ధిదారులకు కేంద్రాలు అందుబాటులో లేక దూరాభారం పెరిగే అవకాశముంది. అంగన్‌వాడీ కేంద్రాలు దూరమైతే గర్భిణులు, బాలింతలు అక్కడికి వెళ్లి పౌష్టికాహారం తీసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని