logo

స్వశక్తి సంఘాల్లో రూ.20 లక్షలు స్వాహా

కరీంనగర్‌ రూరల్‌ మండలం చేగుర్తిలో స్వశక్తి సంఘాల డబ్బులు కాజేసిన విషయం ఇటీవల వెలుగు చూడగా.. డీఆర్డీవో ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Published : 07 Dec 2021 05:58 IST

చేగుర్తి(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: కరీంనగర్‌ రూరల్‌ మండలం చేగుర్తిలో స్వశక్తి సంఘాల డబ్బులు కాజేసిన విషయం ఇటీవల వెలుగు చూడగా.. డీఆర్డీవో ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. డీపీఎం, ఏపీఎం, స్త్రీనిధి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయగా గత ఐదు రోజులుగా కమిటీ గ్రామానికి చేరుకొని అక్కడి రికార్డులను పరిశీలించింది. వీవో సంఘంలో నిధులు, స్త్రీనిధి డబ్బులు అక్కడి వీవో అధ్యక్షురాలు బ్యాంకుల జమ చేయని వాటిపైన రికార్డులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సంఘ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం మీద రూ.20 లక్షల వరకు డబ్బులు స్వాహా అయినట్లు కమిటీ సభ్యులు నిర్ధారించి నివేదికను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి అందజేశారు. సంఘ సభ్యుల నిధుల స్వాహాపై డీఆర్డీఓ ఎల్‌.శ్రీలతను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా విచారణలో రూ.20 లక్షలు జమకాలేదని తేలింది. ఇందులో బాధ్యులు ఎవరెవరున్నానేది గుర్తించి వారిపైన శాఖాపరమైన చర్యల కోసం కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామన్నారు. స్వాహా చేసిన నిధులు రికవరీ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని