logo
Published : 03/12/2021 02:47 IST

ప్రమాదవశాత్తు పడి ప్లంబర్‌ మృతి

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: భవనం పైనుంచి కిందపడిన ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన వడ్డెపల్లి శ్రీకాంత్‌(25) కొంతకాలంగా హయత్‌నగర్‌లోని ప్రియదర్శిని కాలనీలో కుటుంబ సభ్యులతో ఉంటూ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు.  బుధవారం ఉదయం శ్రీకాంత్‌ తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులో చరవాణిలో మాట్లాడుతుండగా సెల్‌ఫోన్‌ జారి కిందపడింది. ఆ వెంటనే శ్రీకాంత్‌ దాన్ని పట్టుకునేందుకు కిందకు వంగిచూస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని