logo
Published : 03/12/2021 02:49 IST

తక్కువ ప్రీమియంతో బీమా అంటూ మోసం

నకిలీ కాల్‌సెంటర్‌ నిర్వాహకుల అరెస్టు

నిందితులు, స్వాధీనం చేసుకున్న వస్తువులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేసి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావుల తెలిపిన వివరాల ప్రకారం...తమిళనాడుకు చెందిన గోపికృష్ణ వెంకటకృష్ణవాసు(32), నటరాజన్‌ ఆర్ముగం(36) కొన్నిరోజుల క్రితం తిరుమలగిరిలో ‘యునైటెడ్‌ ఇండియా హెల్త్‌ ఆర్గనైజేషన్‌’(యుఐహెచ్‌ఓ) పేరుతో నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. టెలికాలర్‌ను ఏర్పాటు చేసుకుని, ప్రైవేట్‌ డేటా అందించే ఏజెన్సీల నుంచి ఫోన్‌నంబర్లు సేకరించారు. తక్కువ ప్రీమియంలో హెల్త్‌ ఇన్యూరెన్స్‌ పాలసీ అందిస్తామని నమ్మించి చాలా మంది నుంచి డబ్బు వసూలు చేశారు. స్మార్ట్‌ మనీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లపై తక్కువ వ్యవధిలో అధిక రాబడిని పొందవచ్చని మోసాలకు పాల్పడ్డారు. బాధితులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఉత్తర మండలం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో పలు నకిలీ కాల్‌సెంటర్లు స్థాపించి, తక్కువ వడ్డీరేట్లకు ఆన్‌లైన్‌లో రుణాలిప్పిస్తామని పలువురిని గోపికృష్ణ వెంకటకృష్ణ వాసు మోసం చేశాడని అక్కడి పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేశారు. జైలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని