logo
Published : 03/12/2021 02:49 IST

త్వరితగతిన అర్హులకు ఇళ్లు దక్కాలి

రమణమ్మకు చెక్కు అందజేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌:  జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద వివిధ ప్రాంతాల్లో నిర్మించి వదిలేసిన 2,336 ఇళ్లను వీలైనంత త్వరితగతిన అర్హులకు అందజేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మాసబ్‌ట్యాంకులోని ఆయన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌,   ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌,  సాయన్న, రాజాసింగ్‌, బలాలా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడల్లో పేదల శుభకార్యాల కోసం బల్దియా ఖాళీ స్థలాల్లో ఒక్కోటి రూ.5కోట్ల వ్యయంతో మల్టీపర్పస్‌ వేదికలు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ను మంత్రి తలసాని ఆదేశించారు.  పాత మలక్‌పేటలో గతేడాది అక్టోబరు 17న విద్యుదాఘాతంతో మృతి చెందిన దినసరి కూలీ దుడ్డు తమ్మయ్య కుటుంబానికి సాయమందిస్తామని మంత్రి కేటీఆర్‌ గతంలో ప్రకటించగా.. మృతుని భార్య రమణమ్మకు మంత్రి తలసాని గురువారం రూ.5లక్షల చెక్కు అందజేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని