logo
Published : 30/11/2021 06:17 IST

ప్రియుడి చేతిలో ప్రియురాలి హత్య

నాగమణి మృతదేహం

మందడం (తుళ్ళూరు), న్యూస్‌టుడే: ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైన ఘటన మండలంలోని మందడం దళితవాడలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై సురేష్‌ కథనం మేరకు. మందడంలోని దళితవాడకు చెందిన పత్తిపాటి నాగమణి (35), ఆమె భర్త విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేస్తున్న గుంటూరులోని తుపాను నగర్‌కు చెందిన డేవిడ్‌రాజుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి నాగమణి కోసం డేవిడ్‌ రాజు మందడం వచ్చాడు. అతడితో డ్వాక్రాలో నెలనెలా చెల్లించాల్సిన సొమ్ము గురించి ఆమె గొడవ పడింది. ఈక్రమంలో పెద్దగా కేకలు వేస్తుండడంతో డేవిడ్‌రాజు టవల్‌తో ఆమె గొంతును గట్టిగా బిగించడంతో ఊపిరాడక చనిపోయింది. భయపడిన డేవిడ్‌రాజు గదిలోని ఫ్యాన్‌కు టవల్‌ కట్టి, నాగమణి మెడకు బిగించి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న తుళ్ళూరు పోలీసులు సోమవారం ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ వెల్లడించారు.


దీపం చీరకు అంటుకొని మహిళకు తీవ్రగాయాలు

తెనాలిటౌన్‌, న్యూస్‌టుడే: తెనాలి పట్టణం చినరావూరులోని దేవాలయంలో స్థానిక వైకుంఠపురం ప్రాంతానికి చెందిన సుమారు 40 సంవత్సరాల మహిళ సోమవారం ఉదయం కార్తిక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకుంది. ఆ సమయంలో ఆలయంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ విషయాన్ని వెంటనే ఎవరూ గమనించలేదు. కాగా మంటలతో కేకలు పెట్టుకుంటూ ఆమె ఆలయం వెలుపలికి వచ్చి పడిపోయారు. స్థానికులు ఆమెపై నీరు పోసి మంటలను ఆర్పారు. తొలుత తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. ఘటన గురించి తెలిసిందని, పూర్తి సమాచారం రావాల్సి ఉందని వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని