logo
Published : 30/11/2021 06:17 IST

హెచ్‌సీ, ఏఎస్సైలకు రాత పరీక్ష


జాబితా పరిశీలిస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, పీటీసీ ఎస్పీ దామోదర్‌

గుంటూరు నేరవార్తలు: గుంటూరు రేంజ్‌ పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌/ఏఎస్సైలుగా పని చేస్తున్న వారిలో ఎస్సైలుగా ఉద్యోగోన్నతికి శాఖాపరమైన రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. గుంటూరు అర్బన్‌ (7), గుంటూరు రూరల్‌ (7), ప్రకాశం జిల్లా (11), నెల్లూరు జిల్లా (15) మొత్తం 40 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. వారికి సోమవారం పోలీసు కార్యాలయంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో పరీక్ష నిర్వహించారు. డీఐజీ త్రివిక్రమ వర్మ, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, ఒంగోలు పోలీసు శిక్షణ కేంద్రం (పీటీసీ) ఎస్పీ దామోదర్‌ పర్యవేక్షించారు. డీఐజీ మాట్లాడుతూ ఉత్తీర్ణత సాధించినవారికి సీనియార్టీ ప్రాతిపదికన పోస్టుల ఖాళీల ఆధారంగా ఎంపికైన వారిని ఎస్సై శిక్షణకు పంపిస్తామని తెలిపారు. ఏఎస్పీలు రిశాంత్‌రెడ్డి, రాజు, డీఎస్పీ చిన్నికృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని