logo
Published : 30/11/2021 06:00 IST

పది ప్రశ్న పత్రంపై స్సష్టతేది?

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళ
న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ
ఆన్‌లైన్‌లో విద్యాశాఖ ఉంచిన వార్షిక విద్యా ప్రణాళిక

విద్యా సంవత్సరం (2021-22) పదో తరగతి తరగతులు ప్రారంభమై 100 రోజులు దాటింది. ఆగస్టు 16న పది విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా తరగతులు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో గతంలో పూర్తిస్థాయిలో పాఠశాలలు జరగకపోవడంతో విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులను తరగతులకు ప్రతిరోజూ హాజరయ్యలా చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి 2022 ఏప్రిల్‌ వరకు మొత్తం 188 రోజులు పాఠశాలలు జరిగేలా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రణాళిక రూపొందించింది. వాటి ప్రకారం బేస్‌లైన్‌ పరీక్షలు, నిర్మాణాత్మక మూల్యాంకన(ఎఫ్‌ఏ), సంగ్రహనాత్మక మూల్యాంకన(ఎస్‌ఏ), ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక తయారు చేశారు. సిలబస్‌ ఉన్న దానిలో 30 శాతం తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మరో మూడు నెలల్లో పది పరీక్షలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటివరకు పశ్నపత్రంపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లుగా పది పరీక్షలు నిర్వహించలేదు.

జిల్లాలో 486 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, 300 ప్రయివేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 60వేల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు.

గతంలో ఇలా... ప్రస్తుతం ఎలా..?

2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతికి సంబంధించి అంతర్గత మార్కులు 20, సంగ్రహనాత్మక పరీక్షలకు 80 కలిపి మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష (హిందీ 80 మార్కులతో ఒకే పేపర్‌ మినహా) 2 పేపర్లుగా ఒక్కొక్కటీ 40 మార్కులతో నిర్వహించారు. వాటికి అంతర్గత మార్కులు 20 కలిపి మొత్తం 100 మార్కులుగా పరిగణించారు. 2019-20 విద్యా సంవత్సరంలో అంతర్గత మార్కులు తీసేసి మొత్తం 100 మార్కులకు సంగ్రహనాత్మక పరీక్షలు జరిపేలా, ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు( ఒక్కొక్క పేపర్‌కి 50 మార్కులు) ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్‌ కారణంగా మార్చిలో పాఠశాలలు మూసివేయడంతో పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో కొవిడ్‌ ప్రభావం ఉండటంతో మొత్తం సిలబస్‌ను కుదించి ప్రతి చాప్టర్‌లో కొన్ని అంశాలను తొలగించి ఇచ్చారు. సంగ్రహనాత్మక పరీక్షల్లో 100 మార్కులకు ఒకే పేపర్‌గా, మొత్తం 11 పేపర్లను ఏడు పేపర్లుగా కుదించేలా ఉత్తర్వులు ఇచ్చారు. చివరిలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గకపోవడంతో పది పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు. ఇలా రెండు విద్యా సంవత్సరాలు పది పరీక్షలు జరగలేదు.


పేపర్లు ఒకటా, రెండా..

రోనా మహమ్మారి మూడో విడత ప్రభావం చూపిస్తుందనే వార్తల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో సాగితే ఈ ఏడాదైనా పది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో పది పరీక్షల ప్రశ్నపత్రం ఎలా ఉండబోతుందో ఇప్పటికీ తెలియక అందరిలో ఆయోమయం నెలకొంది. ఇప్పటివరకు ఎఫ్‌ఏ-1 పరీక్ష మాత్రమే నిర్వహించారు. ఎఫ్‌ఏ-2 పరీక్షలు డిసెంబరు 15 నుంచి 22 వరకు నిర్వహించాలని షెడ్యూల్‌ ఇచ్చారు. వాస్తవంగా ముందుగా ఇచ్చిన పరీక్షల ప్రణాళిక ప్రకారం నవంబరు లోపు ఎఫ్‌ఏ-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇక ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2, ప్రీపైనల్‌ పరీక్షలు వరుసగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించేలా ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సిలబస్‌ 50 శాతం పూర్తయింది. ఏయే చాప్టర్లలో ఎంత సిలబస్‌ ఉందనేది అధికారికంగా నిర్ధరించలేదు. కనీసం అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా పాఠశాలలకు పంపలేదు. పది పరీక్షలలో ఒక పేపర్‌ ఉందా.. రెండు పేపర్లు ఉంటాయా, అంతర్గత మార్కులు పరిగణనలోకి తీసుకుంటారా అనే స్పష్టత కొరవడింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని