logo
Published : 30/11/2021 05:00 IST

‘అంతర్జాతీయ విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర’


మాట్లాడుతున్న మండలి బుద్ధప్రసాద్‌. చిత్రంలో వేణుగోపాలరావు, ఆనంద్‌, రాజు తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : భారతీయ భాషలు, కళలు, సాంకేతిక, వైద్య విద్య విజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి అమెరికాలో తెలుగు వారు స్థాపించిన మొట్ట మొదటి అంతర్జాతీయ విశ్వ విద్యాలయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయమని పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కొనియాడారు. సోమవారం ఓ హోటల్‌ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ విజయాలు, విశేషాల ఇష్టా గోష్టి కార్యక్రమం నిర్వహించారు. బుద్ధప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికాలో తెలుగు వారి కోసం సిలికానాంధ్ర ఒక ఒరవడి సృష్టించిందన్నారు. అక్కడ వేల మందికి ‘మన బడి’ పేరుతో తెలుగు భాష నేర్పుతున్నారని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయంలో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతంలో కోర్సులు అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్మన్‌ పప్పు వేణుగోపాలరావు, అధ్యక్షుడు ఆనంద్‌ కూచిబొట్ల, ముఖ్య విద్యాధికారి రాజు చమర్తి, చింతలపూడి జ్యోతి పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని