logo
Updated : 30/11/2021 06:51 IST

ఇవండీ సమస్యలు.. పరిష్కరించరూ..!

స్పందనలో వినతుల సమర్పణ


ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నగరంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌కు వినతి పత్రాలు సమర్పించారు.

* నగరంలోని సాంబమూర్తి రోడ్డులో బోసు బొమ్మ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు మందు బాబుల అడ్డాగా మారిందని సామాజిక సేవకుడు బి.వసంతకుమార్‌ ఫిర్యాదు చేశారు. స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. కాల్వ వెంబడి పారిశుద్ధ్యం అధ్వాన్నంగా, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

* తమ భూములను సర్వే చేసి, విడగొట్టాలని కొండపల్లికి చెందిన జమలాపురపు గాలీబ్‌రావు కోరారు. ఐదారేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నట్టు తెలిపారు.

* పెనమలూరు మండలం పోరంకి సాలిపేటకు చెందిన ఎస్‌.కె.మస్తాన్‌ సాహేబ్‌ (52) ఇటీవల జారి పడడంతో మోకాలికి గాయమైంది. దీనికి శస్త్ర చికిత్స చేయడానికి ఆరోగ్యశ్రీ కింద చెల్లదంటున్నారని, సాయం చేయాలంటూ విన్నవించాడు.

* కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన ఈడే స్వర్ణకుమారికి చెందిన ఆరు సెంట్ల భూమిని, రైల్వే ట్రాక్‌ విస్తరణ కోసం తీసుకున్నారు. ఆ భూమికి నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఆమె ఫిర్యాదు చేసింది.

* కంచికచర్లకు చెందిన పంచుమర్తి నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా విజయవాడలో రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. తనకు 66 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆధార్‌ కార్డులో మాత్రం 55 సంవత్సరాలు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. వృద్ధాప్య పింఛన్‌ పొందడానికి ఇది సమస్యగా మారిందన్నారు.

* రాజీవ్‌నగర్‌కు చెందిన పున్నాన పరశురాం తోపుడు బండిపై పండ్లు అమ్ముతుంటాడు. భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చి పదేళ్ల క్రితం అనధికారకంగా విడిపోయారు. రేషన్‌ కార్డు నుంచి తన పేరును తొలగించారని, ఆరా తీయగా అందులో చనిపోయినట్టుగా నమోదైందని అధికారులు చెబుతున్నారని, తాను బతికే ఉన్నానని, న్యాయం చేయాలని కోరారు.

* వించిపేట అబ్దుల్‌ రజాక్‌ వీధిలో వీంఎసీ కుళాయి పాడయింది. రెండు సంవత్సరాల నుంచి నీరు సరిగా రావడం లేదని శిరంశెట్టి వరాలమ్మ ఫిర్యాదు చేసింది. వీఎంసీ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కరించాలని విన్నవించింది.

* కంచికచర్ల మండలం గొట్టుముక్కలకు చెందిన గుండిమెడ చందు, నగరంలోని భవానీపురంలో ఇంటర్మీడియట్‌ చదివాడు. రెండో ఏడాదిలో లాక్‌డౌన్‌, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే.. ధ్రువీకరణ పత్రాలను ఇస్తామని యాజమాన్యం చెబుతోందని, న్యాయం చేయాలని కోరాడు. విజయవాడ బాలాజీనగర్‌కు చెందిన కె.సుందరరావు, జి.కొండూరు మండలం వెల్లటూరు వాసి శ్రీకాంత్‌ తమకు పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు.

* 67 అర్జీల స్వీకరణ.. స్పందన కార్యక్రమంలో మొత్తం 67 అర్జీలు స్వీకరించినట్టు సబ్‌కలెక్టర్‌ తెలిపారు. రెవెన్యూ శాఖకు 35, వీఎంసీకి 9, ఆరోగ్య శాఖకు 3, సంక్షేమం 3, పీఆర్‌కు 5, మిగతా శాఖలకు 12 వినతులు అందినట్టు ఆయన వివరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని