logo
Updated : 30/11/2021 06:19 IST

చిత్ర వార్తలు

చామ రైతు మోమున ధరహాసం

చామదుంప రైతు కళ్లల్లో నాలుగింతల ఆనందం కనిపిస్తోంది. ఎప్పుడూ 82కేజీల బస్తా రూ.300 పలికేది. నేడు రూ.1300 పలుకుతోంది. కుంచనపల్లికి చెందిన చుక్కా చిన్నబ్బాయి అనే రైతు అరెకరంలో చామదుంప వేస్తారు. ఏటా 40 బస్తాల దిగుబడి వస్తుంది. బస్తాకు రూ.300 చొప్పున ఏటా రూ.12వేలు మాత్రమే వచ్చేది. కానీ నేడు నాలుగురెట్లు ధర పెరిగింది. బస్తా రూ.1300 పలుకుతూ అరెకరానికి రూ.52వేలు వచ్చిందని తెలిపారు. నెల్లూరు, ఒంగోలు, కావలి, వెంటకగిరిలలో ఎక్కువగా పండించే చామదుంప వరదల కారణంగా దెబ్బతినడంతో ధరలు పెరిగి అధిక ఆదాయం వచ్చిందని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో కనిపించిన చిత్రాలివి.

- ఈనాడు, అమరావతి


కాస్త దూరం జరగండమ్మా!

ఓ వైపు దక్షిణ ఆఫ్రికాలో కొత్త వేరియంట్‌ కలవరపెడుతోంది. జిల్లా యంత్రాంగం మరోవైపు సన్నద్ధత ప్రకటిస్తోంది. కానీ జనాలు ఇవేమీ పట్టించుకున్నట్టు లేరు. భౌతికదూరం మరిచారు. కార్తికమాసం ఆఖరి సోమవారం విజయవాడ దుర్గా ఘాట్లో పరిస్థితిది.

- ఈనాడు, అమరావతి


బస్సులు రాని బస్టాండ్లు

ప్రత్తిపాడు, కాకుమాను మండల కేంద్రాలలో ఉన్న ఆర్టీసీ బస్టేషన్ల ఆవరణలు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికి భారీగా నీరు నిలుస్తోంది. ప్రయాణికులు బస్టేషన్‌లోకి వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. దీంతో ప్రయాణికులు రహదారిపైనే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రత్తిపాడులో వర్షం నీరు, పెదనందిపాడు బస్టాండ్‌ చుట్టూ మురుగునీరు చేరింది.

- ఈనాడు, గుంటూరు, ప్రత్తిపాడు

పెదనందిపాడు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని