logo
Published : 30/11/2021 04:52 IST

సీపీగా పాలరాజుకు అదనపు బాధ్యతలు

ఈనాడు - అమరావతి: విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పాలరాజు నియమితులయ్యారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ డీజీపీ గౌతం సవాంగ్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీపీగా ఉన్న బత్తిన శ్రీనివాసులు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాలరాజు నియామకాన్ని ఖరారు చేశారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సాంకేతిక సేవల విభాగం డీఐజీగా పనిచేస్తున్నారు. శ్రీనివాసులు నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 2005 బ్యాచ్‌కు చెందిన పాలరాజు.. 2016లో నగర డీసీపీ2గా ఏడాది పాటు పనిచేశారు. సాంకేతిక పరిజ్ఞానంపై బాగా పట్టు ఉంది. డీసీపీగా ఉన్న సమయంలో నగరంలో అమలు చేసిన పలు సాంకేతిక సేవలలో ఆయన కీలకపాత్ర పోషించారు. సీపీ సెలవులో వెళ్లిన సందర్భాలలో ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని